స్టాక్స్‌ గురించి తెలుసుకుంటే నో రిస్క్

Know these things before investing in stock market,Know these things before investing,investing in stock market,before investing in stock,stock market,Mango News,Mango News Telugu,Best Investment Plan , Warren Buffett Investment Tips,What are the Rules Before Investing in Stock Markets,Rules Before Investing in Stock Markets, No risk if you know about stocks,stock market Latest News,stock market Latest Updates,stock market Live News,stock market investing Latest News

చాలామంది తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని భావిస్తుంటారు. దీనికోసం అడ్డదారులు తొక్కే బదులు స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడి పెడితే బెటరని భావిస్తారు. కాకపోతే ఏ స్టాక్ లాభాలనిస్తుంది, ఏది ముంచేస్తుంది, ఏ సమయంలో ఏ స్టాక్స్ కొనాలన్నదానిపై కనీస అవగాహన లేకపోతే మొదటికే మోసం వచ్చి ఉన్న డబ్బులు కూడా స్టాక్ మార్కెట్లో పోగొట్టుకోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని అనుకునేవాళ్లు ఎక్కువ మందిలో స్టాక్​ మార్కెట్‌నే ఎంచుకుంటారు​. చాలా తక్కువ మొత్తంలోనే పెట్టుబడులు పెట్టి.. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాదన్న విషయం చాలామందికి తెలుసు. నిజమే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి చాలా డబ్బు సంపాదించొచ్చనేది నిజమే. షేర్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించాలని అనుకున్నవాళ్లు ముందుగా కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి. వీటిని బాగా స్టడీ చేయకుండా హడావుడిగా షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసేయకూడదు.

ముందుగా షేర్స్‌లో మీరు ఎలాంటి రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వేగంగానే నష్టాలు రావొచ్చు. రాంగ్ స్టాక్‌ను ఎంచుకుంటే పెట్టిన డబ్బును కూడా పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటపుడు చాలా అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రమోటర్ హానెస్టీ, మూలధనాన్ని తెలివిగా కేటాయించే కంపెనీల సామర్థ్యాలను ముందుగా పరిగణనలోకి తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒకే స్టాక్స్‌లో పెట్టొద్దు. ముందుగా మనం పెట్టుబడి పెట్టేముందు ప్రమోటర్ నిజాయితీని చూడాలి.

అలాగే, ప్రమోటర్ తెలివిగా కేటాయించే షేర్స్, డబ్బులు సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కంపెనీ పదేళ్లలో ఎలా గ్రోత్ అయింది వంటి అంశాలను కూలంకుశంగా గమనించాలి. మూడో విషయం ఏమంటే మార్కెట్లో బాగా పేరున్న కంపెనీలపైన మాత్రమే పెట్టుబడి పెట్టేలా చూసుకోవాలి. ఎక్కువ ఇన్వెస్టర్లు ఉన్న కంపెనీని ఎంచుకోవలి. నిజానికి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి క్రమశిక్షణ, సహనం కావాలి.

కోవిడ్‌కు ముందు, కోవిడ్ తర్వాత కంపెనీ పరిస్థితిని స్టడీ చేయాలి. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు, సంక్షోభం తర్వాత ఎలా ఉంది? అలాగే ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడానికి ముందు, పెంచిన తర్వాత ఎలా ఉందంటూ.. అన్ని వాతావరణాలలో మంచి ప్రదర్శన కనబరిచే కంపెనీని ఎంచుకోవాలి. మీరు ఒక మంచి స్టాక్‌ను ఎంచుకున్న తర్వాత ప్రారంభంలో కొద్దిగా వచ్చే ఒడిదుడుకులకు భయపడొద్దు. కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉండి, మార్కెట్‌ వాటా పెంచుకుంటూ వెళ్తున్న కంపెనీలపై నమ్మకంగా పెట్టుబడులు పెట్టొచ్చు.

కొన్ని కొన్ని సందర్భాలలో సామర్థ్యం ఉన్న స్టాక్ సత్తా తెలియాలంటే మాత్రం సంవత్సరాలు కూడా పట్టొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు హఠాత్తుగా స్టాక్ పెరిగితే మంచి రిటర్న్‌లు రావొచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి ఓపిక అవసరం. కనీసం మూడేళ్లయినా వేచి చూడాలి. అప్పుడు మంచి రిటర్న్స్ వస్తుంటాయి. లాంగ్ టర్మ్‌లో ఈక్విటీ మార్కెట్‌ కన్నా ఎక్కువ రాబడిని అందించే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఇక వేరేవి లేవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 20 =