తెలంగాణలో ఇంటర్ 2022-23 అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల, పండుగ సెలవులు, పరీక్షల వివరాలివే…

Telangana Annual Calendar for Intermediate 2022-23 Academic Year Released, Annual Calendar for Intermediate 2022-23 Academic Year Released, Intermediate 2022-23 Academic Year, Calendar for Intermediate 2022-23 Academic Year Released, Annual Calendar for Intermediate 2022-23 Academic Year, Intermediate Academic Year, Telangana State Board of Intermediate Education, annual calendar for the academic year 2022-23, Telangana Inter Board has finalized the academic year with 221 working days, Telangana Inter Board Says the academic year with 221 working days, TS Inter Academic Calendar 2022, 2022 TS Inter Academic Calendar, Telangana Intermediate academic calendar, TS Inter Academic Calendar News, TS Inter Academic Calendar Latest News, TS Inter Academic Calendar Latest Updates, TS Inter Academic Calendar Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్‌ 15న ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు, జూలై 1 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 221 పనిదినాలు ఉంటాయని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. విద్యార్థులకు అక్టోబర్‌ 2 నుంచి 9వ తేదీ వరకు దసరా సెలవులు, జనవరి 13, 2023 నుంచి జనవరి 15, 2023 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ఇక ఇంటర్మీడియట్ విద్యను అందించే ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్‌ కాలేజీలు (జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులు) ఈ అకడమిక్‌ క్యాలెండర్‌ను పాటించాలని రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఆదేశాలు ఇచ్చింది.

ఇంటర్‌ 2022-23 అకడమిక్‌ క్యాలెండర్‌ వివరాలు:

  • పని దినాలు: 221
  • దసరా సెలవులు: అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 9 వరకు
  • దసరా తర్వాత కాలేజీల ప్రారంభం: అక్టోబర్‌ 10
  • అర్ధ సంవత్సర పరీక్షలు: నవంబర్ 21 నుంచి 26వ తేదీ వరకు
  • సంక్రాంతి సెలవులు: 2023 జనవరి 13, 14,15 (మూడు రోజులు)
  • సంక్రాంతి తర్వాత కాలేజీల ప్రారంభం: జనవరి 16
  • ప్రీఫైనల్ పరీక్షలు: ఫిబ్రవరి 6, 2023 నుంచి ఫిబ్రవరి 13, 2023 వరకు
  • ప్రాక్టికల్‌ పరీక్షలు: ఫిబ్రవరి 20, 2023 నుంచి మార్చి 6, 2023 వరకు
  • ఇంటర్ పరీక్షలు: మార్చి 15, 2023 నుంచి ఏప్రిల్‌ 4, 2023 తేదీ వరకు
  • 2022-23 విద్యా సంవత్సరం చివరి పనిదినం: మార్చి 31, 2023
  • వేసవి సెలవులు: ఏప్రిల్‌ 1, 2023 నుంచి మే 31, 2023 వరకు
  • అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు: మే, 2023 చివరి వారంలో
  • కాలేజీలు తిరిగి ప్రారంభించే తేదీ (2023-2024 విద్యా సంవత్సరం): జూన్ 1, 2023

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + three =