సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం, 8మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

8 Persons Lost Lives in Fire Mishap at Secunderabad PM Modi Announces Rs 2 Lakhs Ex-gratia For Kin of Victims, PM Modi Announces Exgratia, 8 People KIlled in Secunderabad Fire Accident, Fire Breakout in Secunderabad Hotel, 6 People Killed in Fire Accident, Fire Breaks Out At Hotel Building, Mango News, Telangana Fire at Secunderabad Hotel, Fire Breaks Out At Ruby Hotel, Ruby Hotel Secunderabad, Ruby Hotel Fire Accident, Ruby Hotel Latest News And Updates, Secunderabad Fire Breakout News And LIve Updates

సికింద్రాబాద్‌లోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్‌ భవనం కింది అంతస్తులో ఉన్న ఇ-బైక్ షోరూమ్‌లోని స్కూటర్ రీచార్జింగ్ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు పై అంతస్తులోని లాడ్జి మొదటి మరియు రెండవ అంతస్థుల్లోకి వ్యాపించడంతో అక్కడ ఉన్నవారిలో కొందరు ఊపిరి ఆడక చనిపోయారు. దీంతో మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు భయంతో హోటల్ కిటికీల నుంచి దూకేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బహుళ అంతస్తుల భవనంలో చిక్కుకుపోయిన 9 మందిని రక్షించారు. క్షతగాత్రులను యశోద, గాంధీ ఆస్పత్రికి ఆసుపత్రులకు తరలించారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీనిపై సమాచారం అందుకున్న మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే సాయన్న తదితరులు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు.

కాగా సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై సీపీ సీవీ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు ఫ్లోర్లలో మొత్తం 23 రూమ్స్‌ ఉన్నాయని, ప్రమాద సమయంలో రూబీ లాడ్జిలో 25 మంది టూరిస్టులు ఉన్నారని తెలిపారు. కింది నుంచి లాడ్జిలోకి దట్టమైన పొగలు వ్యాపించడంతో ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్నవారిలో 8మంది ఊపిరాడక చనిపోయారని, భయంతో తప్పించుకునే క్రమంలో పైనుంచి దూకిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయని వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు లాడ్జిలోనే మృతి చెందారని, మరో నలుగురు సోమవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. అలాగే మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని, వీరిలో ఒక మహిళ ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా షోరూం నిర్వహిస్తున్నందుకు రంజిత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామని ప్రకటించారు. ఇప్పటికే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసిన ఆయన, ఘటనపై పూర్తి దర్యాప్తు చేయనున్నట్లు ఆనంద్‌ తెలిపారు.

ఇక ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ లో.. ‘తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షలు మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు చెల్లించబడుతుంది. రూ. క్షతగాత్రులకు 50,000 చెల్లిస్తాం’ అని పీఎంఓ ట్వీట్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + twelve =