చంద్రబాబు ఇంటిపై డ్రోన్ల ప్రయోగం

Two Persons Operated Drones over the Chandrababu house,Mango News,Andhra Pradesh Latest News,Andhra Pradesh Political News,Two men nabbed for flying drone over Chandrababu Naidu House,Flying drones over Chandrababu Naidu residence,Two men nabbed for flying drone over Chandrababu residence

ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంపై నేడు కొందరు డ్రోన్లు వినియోగించారు. డ్రోన్ల సంచారాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్సీ టీడి జనార్థన్, దేవినేని అవినాష్ చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్లు ఎలా ప్రయోగిస్తారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్రోన్లు ప్రయోగించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జరిగిన సంఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను నివసించే ఇంటిపై డ్రోన్లు ఎగురవేయడం ఏంటని ప్రశ్నించారు. ఇదే విషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌ మరియు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. తన నివాసంపై డ్రోన్లు ఎగురవేయడానికి అనుమతి ఎవరిచ్చారని డీజీపీ, రాష్ట్రప్రభుత్వ అనుమతి లేకుండా ఎలా కుదురుతుందని అన్నారు, తన భద్రతనే ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారని విమర్శించారు. ఈ సంఘటనలో పట్టుబడిందెవరో, ఈ చర్య వెనుక ఉద్దేశం ఏందో వెంటనే తెలియజేయాలి అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ అక్కడికి చేరుకొని ఇలా ఎందుకు జరిగిందంటూ పోలీసులను నిలదీస్తున్నారు. అయితే డ్రోన్ ద్వారా విజువల్స్ చిత్రీకరించమని తామే కోరినట్టు ఏపీ జలవనరుల శాఖ ప్రకటించింది, అక్కడ వరద పరిస్థితిని అంచనా వేసుకునేందుకే విజువల్స్ తీయమన్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=EqvdmeA_vMc]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 14 =