రైతులు, పంటల వివరాల నమోదుకై “ఏఈఓ” యాప్ విడుదల చేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Agriculture Minister Singireddy Niranjan Reddy Launches AEO App for Farmers and Crop Details, Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Launches AEO App for Farmers and Crop Details, Minister Singireddy Niranjan Reddy Launches AEO App for Farmers and Crop Details, Singireddy Niranjan Reddy Launches AEO App for Farmers and Crop Details, AEO App for Farmers and Crop Details, Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy, Agriculture Minister Singireddy Niranjan Reddy, Minister Singireddy Niranjan Reddy, Telangana Agriculture Minister, Singireddy Niranjan Reddy, Farmers AEO App News, Farmers AEO App Latest News, Farmers AEO App Latest Updates, Farmers AEO App Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం డీఏఓలు, ఏడీఏలు, డీహెచ్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రైతులు, పంటల వివరాల నమోదు కోసం రూపొందించిన “ఏఈఓ” యాప్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలని, ప్రతి ఏఈఓ వంద మంది రైతులను ఎంపిక చేసుకుని ఉద్యాన పంటల వైపు మళ్లించాలని సూచించారు. అక్టోబరు నుండి మే వరకు వేయగలిగే పంటలపై రైతులను వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా సన్నద్దం చేయాలన్నారు.

“అలాగే అన్ని రైతువేదికలలో తప్పనిసరిగా బంతిపూల చెట్లను నాటాలి. డీఎఓలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. తెగుళ్లు సోకి పంటలు నష్టపోయాక కాకుండా ముందే రైతులను అప్రమత్తం చేయాలి. జిల్లాల వ్యవసాయ సదస్సులు విజయవంతానికి మీరు చేసిన కృషి అభినందనీయం. ఎరువులు, విత్తనాలు జిల్లాలలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తీసుకోవాలి” అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ, రైతుబంధు వివరాలు అసంపూర్తిగా ఉన్న ఖాతాలను వ్యవసాయ అధికారులు వెంటనే సరిచేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి రైతుబంధు అందేలా చూడాలని, వివరాల నమోదు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + thirteen =