తెలంగాణ‌లో మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రం అబ‌ద్ధాలు చెప్పడం బాధాకరం: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Slams Centre Response on Sanction of New Medical Colleges to Telangana, New Medical Colleges to Telangana, Minister Harish Rao Slams Centre Response on Sanction of New Medical Colleges, New Medical Colleges, Minister Harish Rao, Minister Harish Rao Slams Centre, New Medical Colleges In Telangana, Telangana Minister Harish Rao, Telangana Minister, Harish Rao, Harish Rao Minister of Finance of Telangana, Minister of Finance of Telangana, Telangana Finance Minister, Minister Harish Rao Slams Centre Response, Mango News, Mango News Telugu,

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. “మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుండి రాలేదని అసత్యాలు చెప్పగా, నేడు మెడికల్ కాలేజీల కోసం ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని మరోసారి అబద్ధాలు చెప్పారని, ఇది చాలా దారుణం, బాధాకరం” అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్స్ చేశారు.

“కొత్త మెడికల్ కాలేజీల మంజూరు కోసం తెలంగాణ రాష్ట్రం ఏనాడూ కేంద్రాన్ని సంప్రదించలేదని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటును, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు. సీఎం కేసీఆర్ చారిత్రాత్మకమైన చొరవ తీసుకుని తెలంగాణలోని 33 జిల్లాల్లో ఒక్కో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 9 =