టీకాంగ్రెస్ కీలక నేతలతో ప్రియాంక గాంధీ భేటీ.. వారం రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయాలని సూచన

AICC General Secretary Priyanka Gandhi Meets Telangana Congress Leaders To Focus on Munugode By-Polls, Priyanka Gandhi Meets Telangana Congress Leaders To Focus on Munugode By-Polls, AICC General Secretary Meets Telangana Congress Leaders To Focus on Munugode By-Polls, AICC General Secretary Priyanka Gandhi, Telangana Congress Leaders, All India Congress Committee, Priyanka Gandhi, Upcoming Munugode Assembly By Election, Munugode Assembly By Election, Munugode By Election, Munugode By Poll, Munugode By-Polls News, Munugode By-Polls Latest News And Updates, Munugode By-Polls Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ మరియు బిజెపీలు అనుసరిస్తున్న దూకుడు రాజకీయాల నేపథ్యంలో.. ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీకాంగ్రెస్ కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ ఆహ్వానం మేరకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కె.సి. వేణుగోపాల్ మరియు మాణిక్కం ఠాగూర్ తదితరుల సమక్షంలో రాష్ట్ర కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్ బాబు, టి.జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎ.మహేశ్వర్ రెడ్డి తదితరులు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ఎన్నిక వ్యూహాలపైనే కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిష్క్రమణ తర్వాత పార్టీలో వెలుగు చూస్తున్న అంతర్గత విభేదాలను కూడా పరిష్కరించుకోవడంపై దృష్టి సారించారు. అలాగే మునుగోడులో పార్టీ బలాలు, బలహీనతలపై విపులంగా చర్చించారు.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ సుమారు రెండున్నర గంటలపాటు పార్టీ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన నాయకులందరితో ఆమె విడి విడిగా సమావేశం అయ్యారు. ఒక్కొక్క నేతతో 10-15 నిమిషాలపాటు మంతనాలు జరిపిన ప్రియాంక ఈ క్రమంలో పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం అందుకోవాలంటే అందరికంటే ముందుగా అభ్యర్థిని ఖరారు చేయాలని, అయితే అభ్యర్థి విషయాన్ని నల్లగొండ జిల్లా నేతల నిర్ణయానికే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక వారం రోజుల్లోగా అభ్యర్థిని ఖరారు చేయాలని సూచించిన ప్రియాంక, ప్రచారం సందర్భంగా అందరినీ కలుపుకుపోవాలని రేవంత్ రెడ్డికి చెప్పారు. అలాగే అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగించే బాధ్యతనుకీలక నేతలైన రాజనర్సింహ, మధుయాష్కీలకు అప్పగించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here