భారత ఆర్మీ చాలా బలమైనది, కానీ ప్రభుత్వమే బలహీనమైనది – ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

AIMIM Chief Asaduddin Owaisi Responds Over Indo-China Border Issue at Arunachal Pradesh,Asaduddin Owaisi,China India Border Issue,Owaisi Criticises Central Govt,Secunderabad Military College,Tamilisai Soundararajan,Mango News,Mango News Telugu,India Vs China War,India Vs China Military,India Vs China Future War,India Vs China Military Strength 2022.India Vs China War 1967,India China,India Military Power,Defence Minister Of India,India Military News,China Vs India Military,China Vs India Military Power 2022,India Vs China Air Force,

భారతదేశ ఆర్మీ చాలా బలమైనదని, అయితే ప్రభుత్వమే బలహీనమైనదని పేర్కొన్నారు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. ఈ మేరకు సోమవారం ఆయన ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఎల్‌ఏసీ వెంబడి ఇటీవల భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విరుచుకు పడ్డారు. ఈ అంశంపై ప్రధాని మోదీ పారదర్శకంగా లేరని, దేశ ప్రజలకు దీనిపై అసత్యాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా అసదుద్దీన్‌ ఒవైసీ దీనిపై మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్ మరియు చైనాల మధ్య రెండు సార్లు ముఖాముఖీ ఘర్షణలు జరిగినట్లు నివేదికలు ఉన్నాయని, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి చర్చలు జరుపక పోగా నిజాలు దాచి పెడుతోందని మండిపడ్డారు. చైనా సైన్యం భారత భూభాగంలోని దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌లను ఆక్రమించినట్లుగా శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడవుతోందని, ఇక మన జవాన్లు శత్రుదేశ సైనికులపై అసామాన్య పోరాటం ప్రదర్శించారని కొనియాడారు. భారత సైన్యం చాలా బలంగా ఉందని, కానీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, అది చైనాను చూసి భయపడోతోందని ఒవైసీ అన్నారు. ఇక ఈ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో లేవనెత్తాయని, దీనిపై చర్చ జరిపి సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయని తెలిపారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను సభలో తిరస్కరించడంతో వాకౌట్ చేయక తప్పలేదని, ఇప్పటికైనా కేంద్రం దీనిపై స్పందించి చైనాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =