అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ వేటు.. అత్యుత్సాహమే కారణమా..?

Anjani Kumars suspension is due to overzealousness,Anjani Kumars suspension,suspension is due to overzealousness,DGP Anjani Kumar, Revanth Reddy, Telangana Assembly elections,Mango News,Mango News Telugu,Telangana DGP Anjani Kumar,DGP Anjani Kumar Latest News,Anjani Kumars suspension Latest Updates,Telangana Assembly Election Results,Telangana Politics, Telangana Political News And Updates
DGP Anjani Kumar, Revanth Reddy, Telangana Assembly elections,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ డీజీపీ అంజనీ కుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా ఆయన పదవికే ఎసరొచ్చింది. ఎన్నికల నింబంధనలు ఉల్లంఘించడంతో.. అప్పటి వరకు డీజీపీ పదవిలో ఉన్న అంజనీ కుమార్ ఒక్కసారిగా మాజీ డీజీపీ అయిపోయారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రేవంత్ రెడ్డిని కలవడమే ఆయన కొంప ముంచింది.

ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం వరకే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనే విషయం తేలిపోయింది. అప్పటికే కాంగ్రెస్ నేతలు సంబురాలు మొదలు పెట్టారు. ఈక్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పూల బొకే ఇచ్చి రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్ సత్కరించారు. కాసేపు రేవంత్ రెడ్డితో ముచ్చటించాక.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

అయితే రేవంత్ రెడ్డిని కలిసిన కొద్ది నిమిషాలకే ఎన్నికల కమిషన్ అంజనీ కుమార్‌కే ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రేవంత్ రెడ్డిని కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేసిన కొద్ది గంటలకే.. రవిగుప్తాను ఎన్నికల కమీషన్ డీజీపీగా నియమించింది. ఆదివారం సాయంత్రం రవిగుప్తా డీజీపీగా బాధ్యతలు కూడా స్వీకరించారు.

అయితే అప్పటికి ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాలేదు కాబట్టి నిబంధనల ప్రకారం అంజనీ కుమార్.. రేవంత్ రెడ్డిని కలవకూడదు. అత్యవసరమైతేనే ముఖ్యమంత్రిని కాలవాలి. ఇంకా ప్రధాన ప్రతిపక్ష నేతలను కలిసేందుకు అసలు అవకాశం లేదు. ఒకవేళ వాళ్లే రమ్మని పిలిచినా కూడా.. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నాకే వారిని కలువాలి. కానీ ఎటువంటి అనుమతి తీసుకోకుండా.. నిబంధనలను అతిక్రమించి అంజనీ కుమార్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. దీంతో మొదటికే మోసం వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + six =