అన్ని జిల్లాల కంటే వెనుక బడిన పోలింగ్ శాతం

Are Hyderabad voters so lazy,voters so lazy,Hyderabad voters,Hyderabad voters so lazy, Polling percentage,all districts, votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,BSP, CPI, CPM, independents,Mango News,Mango News Telugu,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,voters so lazy News Today,Hyderabad voters Latest News,Hyderabad voters Latest Updates
Hyderabad voters so lazy, Polling percentage , all districts, votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,BSP, CPI, CPM, independents,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకం అయిన  పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్ర ఐదు గంటలకు ముగియనుంది. అయితే 5 గంటల లోపు పోలింగ్ బూత్‌లలో ఉన్నవారికి 5 గంటలు దాటినా ఓటు వేసే అవకాశం ఉంటుంది. అంటే అప్పటికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందన్నమాట.  5 గంటలకు ఒక్క నిమిషం దాటి పోలింగ్ బూత్‌కు వెళ్లినా.. వారిని  ఓటింగ్‌కు అనుమతించరు.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు  ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. అతి తక్కువగా హైదరాబాద్ జిల్లాలో 32 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

అటు హైదరాబాద్‌లో అన్ని జిల్లాల కంటే పోలింగ్ శాతం నమోదు అవుతుండటంతో.. ఓటు వేసేందుకు సిటీ ఓటర్లు బయటకు రావాలని ఈసీ కూడా పిలుపునిచ్చింది. పోలింగ్ వేళ రాజధాని ఓటర్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లరని.. ఓటు వేయడానికి అసలే ఆసక్తి చూపించరనే  మాటను ఇప్పుడు మరోసారి రుజువు చేసినట్లు అయింది.తప్పని సరి పరిస్థితుల్లో ఓటు వేయకపోతే ఓకే కానీ.. తప్పించుకునీ మరీ ఓటు వేయకపోవడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ గణంకాలు ఎప్పుడు  కూడా నేతలను చిరాకు పెడుతూనే ఉంటాయన్న వాదన  ఎప్పటి నుంచో ఉంది.  అన్నింట్లో ముందుండే హైదరాబాద్  ఓటర్లు.. ఓటు వేయడంలో మాత్రం ఎప్పుడూ ఎందుకు వెనుకడుగు వేస్తారా అని సోషల్ మీడియా వేదికగానూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్షరాస్యత  తక్కువ ఉండే పల్లెల్లో..  గ్రామీణులంతా పెద్ద ఎత్తున ఓటింగ్ వేస్తున్నారు. కానీ  ఎక్కువ చదువుకున్న వారు, ఉద్యోగస్తులు పైగా  ఓటు విలువ ఏంటో తెలిసిన అర్బన్ ఓటర్లు మాత్రం ..ఓటు వేయడానికి బయటకు రారంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

అటు జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన  నిర్మాత అల్లు అరవింద్..హైదరాబాద్ ఓటర్ల మీద ఘాటుగా సెటైర్లు వేశారు. హైదరాబాద్ ఓటర్లలో  ఈరోజు  హాలీడే కదా అని బీరు తాగి ఇంట్లో పడుకునే ఓటర్లు చాలా మంది ఉన్నారని విమర్శించారు. హైదరాబాదీలు అలా చేస్తే ఎమ్మెల్యేను ప్రశ్నించే హక్కు వారికి ఉండదని. అందరూ లేచి వచ్చి ఓటు వేయండని కోరారు. అయితే  అన్నీ తెలిసిన విజ్ఞానవంతులయిన హైదరాబాదీలు మాత్రం .. ఈ ఎన్నికలలో కూడా ఓటింగ్‌కు  దూరంగా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =