టీఎస్ ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

Telangana ECET 2023 Schedule Released Entrance Exam held on May 20th,Telangana ECET 2023,Telangana ECET Schedule Released,Telangana ECET Entrance Exam,Telangana ECET Exam on May 20th, Mango News, Mango News Telugu,Ts Ecet,Telangana Ecet 2023,Telangana Ecet Apply Online,Telangana Ecet Counselling,Telangana Ecet Counselling Dates,Telangana Ecet Counselling Dates 2023,Telangana Ecet Exam Date 2023,Telangana Ecet Hall Ticket Download,Telangana Ecet Hall Ticket Download 2023,Telangana Ecet Previous Papers,Telangana Ecet Registration,Telangana Ecet Result 2021,Telangana Ecet Results,Telangana Ecet Syllabus,Ts Ecet 2023,Ts Ecet Counselling,Ts Ecet Registration,Ts Ecet Web Options

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మ‌న్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకట రమణ, ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీ డి.ర‌వీందర్, ఈసెట్‌-2023 క‌న్వీన‌ర్ శ్రీరాం వెంక‌టేశ్‌ తో కలిసి సోమవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సి మాథెమాటిక్స్ విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/బీటెక్, బీఫార్మ‌సీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్‌ ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. మే 20వ తేదీన ఈసెట్‌-2023 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.

మే 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, సివిల్, కెమికల్, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష జరగనుంది. 2023 సంవత్సరానికి గానూ ఈసెట్ ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనున్న విషయం తెలిసిందే.

టీఎస్ ఈసెట్-2023 ప్రవేశ పరీక్షషెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చి 1
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 2
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : మే‌ 2
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 8
  • ఆలస్య రుసుము రూ.2500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 12
  • సబ్మిట్ చేసిన దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం: మే 8 నుంచి మే 12 వరకు
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : మే 15నుండి
  • ఈసెట్-2023 పరీక్ష నిర్వహణ : మే 20.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =