కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ.. ఆ ముగ్గురిని హోల్డ్‌లో పెట్టిన అధిష్టానం

At the last minute Congress shocked the three,At the last minute Congress shocked,Congress shocked the three,Im Not Surprised By Nitish Kumar,Congress, revanth reddy, Telangana Congress, Congress candidates, Telangana assembly elections,Mango News,Mango News Telugu,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana assembly elections Latest News,Telangana assembly elections Latest Updates,Telangana assembly elections Live News
Congress, revanth reddy, Telangana Congress, Congress candidates, Telangana assembly election's

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళయింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. అన్ని పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టి ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ కీలక సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. చివరి నిమిషంలో ఇప్పటికే ఖరారు చేసిన ముగ్గురు అభ్యర్థులకు అధిష్టానం షాక్ ఇచ్చింది. బీ ఫారాలు ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. బీ ఫారం ఎప్పుడిస్తారా?.. ఎప్పుడు నామినేషన్ వేద్దామా? అని వారు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో బీ ఫారాలు ఇవ్వకుండా అధిష్టానం పక్కన పెట్టడంతో.. ఆయా నేతలు అయోమయంలో పడిపోయారు.

 

ఆదివారం గాంధీ భవన్‌లో అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అయితే వనపర్తి, చేవెళ్ళ, బోధ్ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టారు. ముందుగా వనపర్తి నుంచి చిన్నారెడ్డి, చేవెళ్ల నుంచి పమేనా భీం భరత్, బోధ్ నుంచియోజకవర్గంలో నెగిటివిటీ ఉందని తేలిందట. దీంతో ఆయా సర్వే నివేదికల ఆధారంగా వారికి బీ ఫా వెన్నెల అశోక్‌లకు టికెట్ ఖరారు చేశారు. అయితే తాజాగా అందిన సర్వే రిపోర్టుల్లో ఆయా అభ్యర్థులకు నిరాలు ఇవ్వకుండా ఆపేశారు. వారి స్థానంలో కొత్త వ్యక్తుల పేర్లను పరిశీలిస్తున్నారట. వనపర్తి నుంచి శివసేనా రెడ్డి, బోధ్ నుంచి నరేష్ జాదవ్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

 

అయితే ముందుగా చిన్నారెడ్డి, పమేనా భీం భరత్, వెన్నెల అశోక్‌లకు టికెట్ ఇవ్వడంతో.. వారంతో వారి వారి నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీ ఫారం అందిన వెంటనే నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో షాక్ ఇవ్వడంతో.. ఆయా నేతలు అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నారు. అది వారికి అవమానంగా భావిస్తున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. చివరి నిమిషంలో తమను కాదని కొత్త వ్యక్తులకు టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పరిశీలనలోకి వచ్చిన నేతలు.. తమకంటే ఏ విధంగా మెరుగైనవారో నిరూపించాలని నిలదీస్తున్నారు. మరి చివరికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =