ఆగస్టు 27న తెలంగాణకు జేపీ నడ్డా, బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభకు హాజరు

Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Concluding Meeting on AUG 27 BJP National President JP Nadda will Attend, BJP National President JP Nadda will Attend Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Concluding Meeting on AUG 27, Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Concluding Meeting on AUG 27, BJP National President JP Nadda, Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra, 3rd Phase Praja Sangrama Yatra, Praja Sangrama Yatra, Bandi Sanjay Kumar, JP Nadda, 3rd Phase Praja Sangrama Yatra News, 3rd Phase Praja Sangrama Yatra Latest News And Updates, 3rd Phase Praja Sangrama Yatra Live Updates, Mango News, Mango News Telugu,

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో యాత్ర 19వ రోజుకు చేరుకోగా, మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆగస్టు 27వ తేదీన వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ముగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 27వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు ప్రకటించారు.

జేపీ నడ్డా హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణ సహా ఇతర అంశాలపై పార్టీ నేతలకు బండి సంజయ్ ఇప్పటికే కీలక సూచనలు చేశారు. ఆదివారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరైన మునుగోడు సమరభేరి సభతో బీజేపీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకుంది. ఇదే ఊపులో బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను కూడా విజయవంతం చేయడంపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. బీజేపీ అగ్రనేతల పర్యటనలు, సీఎం అధ్యక్షతన అధికార టీఆర్ఎస్ సభలు, కాంగ్రెస్ నేతల పర్యటనలతో నాయకుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల యుద్ధం జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 12 =