దేశానికి కీడు చేసే ప్రయత్నాలపై మేధావులు మౌనం వ‌హించ‌డం స‌రికాదు – స్వతంత్ర భారత వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో సీఎం కేసీఆర్

CM KCR Hoists National Flag in The Closing Ceremony of Swatrantra Bharata Vajrotsavalu at LB Stadium, Telangana CM KCR Hoists National Flag, Closing Ceremony of Swatrantra Bharata Vajrotsavalu at LB Stadium, Swatrantra Bharata Vajrotsavalu, Swatrantra Bharata Vajrotsavalu Closing Ceremony, Closing Ceremony, LB Stadium, Telangana CM KCR Speech, CM KCR Speech, Swatrantra Bharata Vajrotsavalu Closing Ceremony News, Swatrantra Bharata Vajrotsavalu Closing Ceremony Latest News And Updates, Swatrantra Bharata Vajrotsavalu Closing Ceremony Live Updates, Mango News, Mango News Telugu,

దేశానికి కీడు చేసే ప్రయత్నాలపై మేధావులు మౌనం వ‌హించ‌డం స‌రికాదని, అలాంటివి అర్థమైన త‌ర్వాత కూడా అర్థం కాన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం మేధావుల ల‌క్ష‌ణం కాదని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్‌ లోని ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర‌ముఖ ఖ‌వాలి క‌ళాకారులు వార్సి బ్ర‌ద‌ర్స్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఖ‌వాలి వీక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రఖ్యాత సినీ సంగీత ద‌ర్శ‌కుడు, నేపథ్య గాయకుడు శంకర్ మహదేవన్ గ‌ణ‌నాయకాయ‌ పాట‌తో సభికులను మైమరిపించారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాప‌నలో కోటి మంది పాల్గొన్నారని, ఇది రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణమని అన్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇప్పటికీ పేద‌ ప్రజల ఆశ‌లు నెర‌వేర‌లేదని, వారి ముఖాల్లో ఈ ఆవేద‌న స్పష్టంగా కనిపెడుతోందని అన్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి త‌రం పిల్ల‌ల‌కు, యువ‌కుల‌కు తెలియ‌ప‌ర‌చాల‌నే ఉద్దేశంతో ఈ స్వతంత్ర భారత వ‌జ్రోత్స‌వ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని వెల్లడించారు. దేశానికి బ్రిటీష్ వారి నుంచి విముక్తి కలిగించేందుకు ఎంద‌రో మ‌హ‌నీయులు త్యాగాలు చేశారని, వారిలో అగ్రగణ్యులు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. మ‌హాత్ముడు విశ్వ‌మాన‌వుడని, ఆయ‌న గొప్ప‌త‌నాన్ని యూఎన్‌వో ప్ర‌శంసించిందని గుర్తు చేశారు.

ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆయన జీవిత విశేషాలు, విగ్ర‌హాలు విదేశాల్లో ఉన్నాయని, ఇది మన దేశానికి గ‌ర్వ‌కార‌ణమని సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకే ఆయన గురించి తెలియజెప్పేందుకు గాంధీ సినిమాను ప్రత్యేకంగా పిల్లలకు ఉచితంగా చూపించామని గుర్తు చేశారు. గాంధీ సినిమాను 22 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు చూశారని, వీరిలో కనీసం 10 శాతం మందిలో స్ఫూర్తి క‌లిగినా చాలని, వారు దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. గాంధీ మార్గంలో అహింసా సిద్ధాంతాన్ని ఉప‌యోగించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని స్పష్టం చేశారు. అలాగే అందరూ గాంధీజీ బాటలోనే పయనించాలని.. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందాలని, అప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =