తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరైన బండి సంజయ్

Bandi Sanjay Appears Before Telangana Women Commission over his Derogatory Comments Against MLC Kavitha,Bandi Sanjay Appears Women Commission,Telangana Women Commission over Bandi Sanjay,Bandi Sanjay over his Derogatory Comments,Bandi Sanjay Comments Against MLC Kavitha,Mango News,Mango News Telugu,Derogatory remarks row,Derogatory remarks about K Kavitha,Telangana Women Commission Issues Notice,BRS Protests Against Bandis Comments,BRS Activists Protest,Derogatory Comments against MLC Kavitha,Delhi Liquor Policy Case,Telangana Political News And Updates,Telangana Womens Commission Latest Updates

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు ఉదయం (మార్చి 18, శనివారం) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణకు సంబంధించి బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి బండి సంజయ్ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ముందుగా ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.

ఈ మేరకు మహిళా కమిషన్ బండి సంజయ్ ని మార్చి 15వ తేదీన కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించగా, తనకు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని, ఈ నెల 18వ తేదీన కమిషన్ చైర్ పర్సన్ సూచించిన సమయానికి హాజరు అవుతానని లేఖలో అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కమిషన్ అందుకు సానుకూలంగా స్పందించి, మార్చి 18వ తేదీన ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈ రోజు బండి సంజయ్ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here