కోవాగ్జిన్ వ్యాక్సిన్ త‌యారీలో మాపై ఎటువంటి వత్తిడి లేదు, ఆరోపణలు అవాస్తవం – భార‌త్ బ‌యోటెక్

Bharat Biotech Announces No External Pressure To Accelerate Development of Covaxin Vaccine,Bharat Biotech,Covaxin Vaccine,Bharat Biotech No External Pressure,Mango News,Mango News Telugu,Covaxin,Covaxin Latest News And Updates,Covaxin COVID Vaccine,COVID Vaccine,COVID19 Vaccine,COVID-19 Vaccine,India COVID News and Updates,India COVID,India COVID Latest News And Live Updates

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన అభివృద్ధిని వేగవంతం చేయడానికి సంస్థపై ఎటువంటి బాహ్య ఒత్తిడి లేదని గురువారం తెలిపింది. ఈ మేరకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ త‌యారీపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన సంస్థ దీనిపై త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో ఒక లేఖను పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ ను అనేక వందల మిలియన్ డోస్‌లను అందిస్తున్నామని, ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి ప్రతికూల సంఘటనలు కనుగొనబడలేదని, మయోకార్డిటిస్ లేదా థ్రోంబోసైటోపెనియాకు వ్యాక్సిన్ సంబంధిత కేసులు కూడా కనుగొనబడలేదని పేర్కొంది. అయితే టీకాలపై కానీ లేదా వ్యాక్సినాలజీలో కానీ ఎటువంటి నైపుణ్యం లేని కొందరు వ్యక్తులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారు చెప్పేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేసింది.

ఇక కోవాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి బాహ్య ఒత్తిడి లేదని తెలిపిన సంస్థ.. కోవిడ్ -19 మహమ్మారికి సురక్షితమైన మరియు ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి, అలాగే భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మరియు జీవనోపాధిని కాపాడటానికై ప్రయత్నించే క్రమంలో తమపై అంతర్గత ఒత్తిడి ఉందని వెల్లడించింది. కాగా కోవాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అధ్యయనం చేయబడిన కోవిడ్-19 వ్యాక్సిన్‌లలో ఒకటి అని, ఇంకా మూడు ఛాలెంజ్ ట్రయల్స్ మరియు తొమ్మిది హ్యూమన్ క్లినికల్ స్టడీస్‌తో సహా సుమారు 20 ప్రీ-క్లినికల్ అధ్యయనాలలో విజయవంతంగా నిలిచిందని ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + two =