బిగ్‌బాస్-7 విజేతకు 14 రోజుల రిమాండ్

Bigg Boss 7 Winner Remanded for 14 Days,Bigg Boss 7 Winner Remanded,Remanded for 14 Days,Bigg Boss 7 Winner,Bigboss-7, Pallavi Prashanth, Prashanth arrest,Mango News,Mango News Telugu,14 Days Remand For Pallavi Prashanth,Four days after winning Big Boss,Pallavi Prashanth Arrested,Pallavi Prashanth Latest News,Pallavi Prashanth Latest Updates,Pallavi Prashanth Live News,Bigg Boss 7 Winner Latest News
Bigboss-7, Bigboss-7 Winner, Pallavi Prashanth, Prash arrest

రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచారు పల్లవి ప్రశాంత్. ఎక్కడో మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రశాంత్.. పట్టుదలతో బిగ్ హౌజ్‌లోకి వెళ్లారు. బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్క్‌లలో తన ప్రతిభ చూపించి.. తోటి హౌజ్‌మేట్స్ అందర్నీ వెనక్కి నెట్టి బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచారు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ప్రశాంత్ అత్యుత్సాహమే అతని కొంప ముంచింది. మొన్నటి వరకు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ప్రశాంత్ ఇప్పుడు జైలు జీవితం గడపాల్సి వస్తోంది.

పోయిన ఆదివారం బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ జరిగింది. పల్లవి ప్రశాంత్‌ను బిగ్ బాస్ విజేతగా అనౌన్స్ చేశారు. రూ. 35 లక్షల ప్రైజ్ మనీ, రూ. 15 లక్షల విలువచేసే డైమండ్ జ్యూలరీ, కారును ప్రశాంత్ గెలుచుకున్నారు. అయితే ప్రశాంత్ గెలుపొందడంతో.. బిగ్‌బాస్ హౌజ్ బయట అతని అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అయితే పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు.. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని.. హౌజ్ వెనక నుంచి వెళ్లిపోవాలని ప్రశాంత్‌ను కోరారు.

అయితే ప్రశాంత్ మాత్రం పోలీసుల మాట ఏమాత్రం వినకుండా మెయిన్ గేట్ నుంచే బయటికి వచ్చి ఊరేగింపుగా వెళ్లారు. ఈక్రమంలో ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వస్తున్న వారి కార్లను అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. అలాగే ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులపై కూడా అభిమానులు దాడి చేసి నానా హంగామా చేశారు. అక్కడ పరిస్థితిని ఉద్రిక్తకరంగా మార్చేశారు.

ఈక్రమంలో పోలీసులు ఈ ఘటనను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. మొత్తం 9 సెక్షన్ల కింద ప్రశాంత్‌పై కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ఏ1గా.. అతని సోదరుడిని ఏ2గా చేర్చారు. బుధవారం అతడి సొంతూరు అయిన గజ్వేల్ మండలం కొల్గుర్‌కు వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ప్రశాంత్‌ను అతని సోదరుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌ను విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు  నిర్వహించి.. నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.

ఈ మేరకు విచారణ జరిపిన న్యాయమూర్తి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో పోలీసులు ప్రశాంత్, అతని సోదరుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే అతని అత్యుత్సాహమే ప్రశాంత్‌ను జైలు పాలు చేసిందని నెటిజన్లు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 3 =