‘నీతి ఆయోగ్’ నిరర్ధక సంస్థగా మారింది, రేపటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం – ప్రకటించిన సీఎం కేసీఆర్

Boycotting Tommorrow's NITI Aayog Meeting Says CM KCR in Press Meet, CM KCR Says Boycotting Tommorrow's NITI Aayog Meeting in Press Meet, Telangana CM KCR Says Boycotting Tommorrow's NITI Aayog Meeting in Press Meet, KCR Says Boycotting Tommorrow's NITI Aayog Meeting in Press Meet, CM KCR Says Boycotting Tommorrow's NITI Aayog Meeting, Boycotting Tommorrow's NITI Aayog Meeting, Boycotting NITI Aayog Meeting, NITI Aayog Meeting, CM KCR will hold Press Conference Today at 4 PM, Press Conference in Pragathi Bhavan, Pragathi Bhavan, Press Conference, CM KCR Press Conference in Pragathi Bhavan, CM KCR Press Meet News, CM KCR Press Meet Latest News, CM KCR Press Meet Latest Updates, CM KCR Press Meet Live Updates, Mango News, Mango News Telugu,

‘నీతి ఆయోగ్’ నిరర్ధక సంస్థగా మారిందని, అది చేసే సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ ద్వారా తమ నిరసన తెలియజేస్తున్నామని వెల్లడించారు. కాగా మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్‌, మిషన్‌ కాకతీయకు రూ. 5 వేల కోట్లు గ్రాండ్‌ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందని తెలిపిన సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వం మాత్రం వాటిని బుట్టదాఖలు చేసిందని సీఎం కేసీఆర్ విమర్శించారు.

మిషన్‌ కాకతీయ, భగీరథ పూర్తయినా నిధులు ఇవ్వలేదని, నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. నిధుల కేటాయింపు విషయంలో గందరగోళం ఉందని, ఉద్ధేశ్యపూర్వకంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. నీతి ఆయోగ్ ఎజెండాలో ఎవరి భాగస్వామ్యం ఉందో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. సహకారాత్మక సమాఖ్య విధానం పోయి, డిక్టేటరిజం పెరిగిపోయిందని విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశాల్లో ముఖ్యమంత్రులు మాట్లాడటానికి కూడా సమయం విధిస్తున్నారని, అనుభవంతో దేశానికీ ఉపయోగపడే సలహాలు ఇచ్చినా తీసుకునే స్థితిలో లేదని తెలిపారు. నీతి ఆయోగ్ చేసే సిఫార్సులకు విలువే లేదని, కేంద్రం చెప్పిందే చేయాల్సి వస్తోందని, ఇది దేశానికీ మంచిది కాదని సీఎం కేసీఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 11 =