పెట్రోల్ కొట్టించినప్పుడు మీరెలా కొట్టిస్తున్నారు?

If petrol goes like this is it cheating,If petrol goes like this,petrol goes cheating,petrol , petrol cheating , petrol Cost, Petrol Bunks,Mango News,Mango News Telugu, petrol pumps can cheat you,Think youre being cheated at petrol,petrol Cost Latest News,petrol Cost Latest Updates,petrol cheating Live Updates,petrol cheating Latest News,petrol cheating Latest Updates
petrol , petrol cheating , petrol Cost, Petrol Bunks,

ఈ మధ్య కాలంలో చాలా మంది పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు..50 రూపాయలు, 100  రూపాయలు, 200  రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు అని కాకుండా.. 113  రూపాయలు, 215  రూపాయలు, 320 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అదేంటి.. ఇలా పెట్రోల్ కొట్టిస్తున్నారని అడిగితే.. అలా కొట్టిస్తేనే పెట్రోల్ ఎక్కువ వస్తుందని..పైగా పెట్రోల్ బంక్‌ల వాళ్లు ట్యాంపరింగ్ చేద్దామన్నా చేయలేరని  చాలామంది సమాధానం చెబుతున్నారు. ఇలా చిల్లర కలిపి పెట్రోల్ కొట్టిస్తే ట్యాంపరింగ్ జరగదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే  నిజానికి  ఇలా చేస్తే నష్టమే ఉంటుందని లాభం ఉండదంటున్నారు నిపుణులు.

పెట్రోల్​ ,డీజిల్‌ను వాహనదారులు గతంలో లీటర్ల రూపంలోనే కొనుగోలు చేసేవారు.  ఇప్పుడు కూడా కొంతమంది లీటర్లలో పెట్రోల్​ పోయించుకుంటున్నారు. అలాగే గతంలో  లీటర్ల లెక్కలతో పాటు..  100 రూపాయలు , 200 రూపాయలు , 300  రూపాయలు, 500 రూపాయలకు పెట్రోల్ కొట్టించేవారు.  కాని ఇప్పుడు  చాలామంది వాహనదారులు మాత్రం  113  రూపాయలు, 215  రూపాయలు, 320 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.

నిజానికి పెట్రోల్ బంక్స్‌లో పెట్రోల్ అమ్మేటపుడు.. పెట్రోల్ నింపే మిషన్‌‌లలో టెక్నాలజీ సాయం తీసుకుంటారు. కొన్ని కోడ్​లతో వాహనదారులు కోరుకున్నట్లు పెట్రోల్​ వచ్చే విధంగా అమర్చుతారు. అంటే వాహనదారుడు ఒకవేళ 100 రూపాయల పెట్రోల్​ అడిగాడంటే..  దానికి  తగినట్లుగా ఒక కోడ్ ను అమర్చుతారు.  ఇలా ఒక్కో రేటుకు ఒక్కో కోడ్​‌ను పెట్రోల్ బంక్స్ వాళ్లు అమర్చుతారు.

పెట్రోల్​ పంప్​ మిషన్​‌లో ఉండే  ఫ్లో మీటర్ ‌లో ఉండే సాంకేతికను ఉపయోగించి .. రూపాయలలో కూడా పెట్రోల్ అందించేలా  సాఫ్ట్​ వేర్‌ను సెట్​ చేస్తారు.  దీని ప్రకారమే పెట్రోల్​ రేటును  నిర్ణయిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు​ 1.24 లీటర్ల పెట్రోల్​ రేటు  136 రూపాయలు ఉందనుకుంటే.. 150 రూపాయిలు పెట్రోల్​ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కూడా వాటిని ముందుగానే సెట్ చేయడం వల్ల  మీటర్ 1.24 లీటర్లే ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ​

అందుకే   113  రూపాయలు, 215  రూపాయలు, 320 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకుంటే ఇలాంటి  మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే లీటర్ లెక్కన కానీ, వంద రూపాయలు, 200 రూపాయలు ఇలా పెట్రోల్ కొట్టించుకుంటేనే ఎక్కువ లాభమని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =