ప్రముఖ కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు పక్షవాతం.. ముఖానికి ‘రామ్‌సే హంట్ సిండ్రోమ్’ సోకినట్లు స్వయంగా వెల్లడి

Popular Pop Singer Justin Bieber Says He is Suffering From Facial Paralysis of Ramsay Hunt Syndrome, Justin Bieber Says He is Suffering From Facial Paralysis of Ramsay Hunt Syndrome, Facial Paralysis of Ramsay Hunt Syndrome, Popular Pop Singer Justin Bieber, Popular Pop Singer, Justin Bieber, Justin Bieber Says He is Suffering From Facial Paralysis, Ramsay Hunt Syndrome, Facial Paralysis, Pop Singer Justin Bieber, Justin Bieber Gets Facial Paralysis, Justin Bieber suffers from Ramsay Hunt syndrome, Justin Bieber Health, Justin Bieber Health Condition, Justin Bieber Health News, Justin Bieber Health Reports, Justin Bieber Latest Health Condition, Justin Bieber Latest Health Report, Justin Bieber Latest News, Justin Bieber Latest Updates, Justin Bieber suffering from Ramsay Hunt syndrome, Mango News, Mango News Telugu,

ప్రముఖ కెనడియన్ పాప్ సింగర్, మల్టీ-గ్రామీ విజేత జస్టిన్ బీబర్‌కు పక్షవాతం సోకింది. ఈ విషయాన్ని బీబర్‌ స్వయంగా సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. తాను ‘రామ్‌సే హంట్ సిండ్రోమ్’ యొక్క ముఖ పక్షవాతంతో బాధపడుతున్నట్లు ఈ ప్రముఖ పాప్ సింగర్ చెప్పాడు. ఆ వీడియోలో అతను మాట్లాడుతూ.. ‘మీరు గమనిస్తే, ఈ కన్ను రెప్పవేయడం లేదు, నేను నా ముఖం యొక్క ఇటువైపు నవ్వలేను, ఈ ముక్కు రంధ్రం కదలదు’ అని బీబర్ వివరించాడు. ప్రస్తుతం ముఖ వ్యాయామాలు చేస్తున్నానని మరియు విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నానని మరియు మునుపటిలా తిరిగి రావడానికి 100% ప్రయత్నం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తనకు తెలియదని, అయితే తాను దేవుడిని నమ్ముతానని బీబర్‌ అన్నాడు.

కాగా బీబర్‌ వయస్సు 28 ఏళ్లే కావడం గమనార్హం. రామ్‌సే హంట్ సిండ్రోమ్‌ అనేది ముఖ పక్షవాతానికి కారణమవుతుంది మరియు షింగిల్స్ వ్యాప్తి ద్వారా ముఖంలోని నరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక చెవి దగ్గర ఉన్న ముఖ నాడిపై ప్రభావం చూపినప్పుడు ఏర్పడుతుంది. ముఖ పక్షవాతంతో పాటు, వినికిడి లోపం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో టొరంటోలో తన మొదటి కచేరీకి కొన్ని గంటల ముందు జస్టిస్ వరల్డ్ టూర్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదే కాకుండా అతను నిర్వహించాల్సిన అనేక మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కూడా రద్దయ్యాయి. అయితే బీబర్‌కు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =