యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు

Chief Justice NV Ramana, CJI Justice NV Ramana, CJI Justice NV Ramana Visits Yadadri Lakshmi Narasimha Swamy Temple, CJI Justice NV Ramana Visits Yadadri Lakshmi Narasimha Swamy Temple Today, CJI NV Ramana visit Yadadri, CJI NV Ramana visits Telangana’s Yadadri temple with family, Justice NV Ramana India, Mango News, NV Ramana, NV Ramana Visits Yadadri, NV Ramana Visits Yadadri Lakshmi Narasimha Swamy Temple, Yadadri Lakshmi Narasimha Swamy, Yadadri Lakshmi Narasimha Swamy Temple

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు మంగళవారం ఉదయం యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని దర్శించుకున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆల‌య అర్చ‌కులు వారికీ పూర్ణ‌కుంభంతో ఆల‌యంలోకి స్వాగ‌తించారు. ల‌క్ష్మీన‌రసింహ‌స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బాలాలయంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వారికి వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా సీజేఐ ఎన్వీ రమణ పరిశీలించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here