రేపటినుంచే డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం

Classes for Degree 1st Year Students in Telangana will Start From Dec 7th,Degree 1St Year Online Classes To Commence On December 7,Classes for Degree 1st Year Students,Degree 1st Year,Telangana,Telangana State,Telangana Degree 1st Year Classes,Telangana Degree 1st Year Classes Start From Dec 7th,Mango News,Mango News Telugu,Ts Degree First Year Classes 2020,TS Degree College Reopening Date 2020,TS Degree Online Classes,TS Degree College Reopening Date 2020,TS Degree College Reopening Date,TS Degree 1st Year Online Classes,TS Degree College Reopen Date 2020,TS Degree College Reopen Date

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు డిసెంబర్ 7, సోమవారం నుంచి ఆన్ లైన్‌ తర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని కాలేజీలు సిద్ధంగా ఉండాలని డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)‌ కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ లింబాద్రి తెలి‌పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదే‌శాలు వచ్చాక రెగ్యు‌లర్‌ తర‌గ‌తుల నిర్వహణపై ప్రకటన చేస్తామని చెప్పారు. డిగ్రీ కోర్సుకు సంబంధించి విద్యాక్యాలెం‌డర్‌ కూడా త్వర‌లోనే విడు‌దల చేస్తా‌మన్నారు.

మరోవైపు దోస్త్‌ ప్రత్యేక విడత‌ కౌన్సె‌లిం‌గ్‌లో 28,136 మంది విద్యా‌ర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారని, అందులో 27,365 మంది విద్యారులకు సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక కౌన్సె‌లింగ్‌ ద్వారా సీట్లు కేటాయించబడిన విద్యార్థులంతా డిసెంబర్ 8 లోపు ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్‌ రిపో‌ర్టింగ్‌ చేయాలని, అంతకు ముందు సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఆ తేదీ లోపే సంబంధిత కాలేజీల్లో ఫిజి‌కల్‌ గా రిపో‌ర్టింగ్‌ చేయాలని తెలిపారు. ఇక గడువు లోపల కాలే‌జీ‌ల్లో రిపోర్టు చేయని విద్యార్థులు సీట్లు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twelve =