దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం అంటే.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌ మాత్రమే – మంత్రి గంగుల కమలాకర్

Telangana Minister Gangula Kamalakar Says TRS Party and CM KCR is The Only Alternate For BJP in Country, Minister Gangula Kamalakar Says TRS Party and CM KCR is The Only Alternate For BJP in Country, Gangula Kamalakar Says TRS Party and CM KCR is The Only Alternate For BJP in Country, Telangana Minister Gangula Kamalakar Says TRS Party is The Only Alternate For BJP in Country, Minister Gangula Kamalakar Says CM KCR is The Only Alternate For BJP in Country, TRS Party and CM KCR is The Only Alternate For BJP in Country, TRS Party is The Only Alternate For BJP in Country, CM KCR is The Only Alternate For BJP in Country, Alternate For BJP in Country, Telangana Minister Gangula Kamalakar, Minister Gangula Kamalakar, Gangula Kamalakar, Telangana Minister, Alternate For BJP, Gangula Kamalakar Minister of BC Welfare, BC Welfare Minister Gangula Kamalakar, Bharatiya Janata Party, Mango News, Mango News Telugu,

ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీకి సరైన ప్రత్యామ్నాయం అంటే.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌ మాత్రమే అని పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని అంటున్నారని, కానీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు సీఎం కేసీఆర్‌ను బీజేపీకి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారని మంత్రి గంగుల తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు ఇప్పటివరకు అహర్నిశలూ రాష్ట్రం బాగుకోసమే సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఈ పథకాల అమలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని, తెలంగాణ పథకాలపై దేశ వ్యాప్త చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ సాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని, పరిపాలన చేపట్టిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో కరువును పారద్రోలారని వెల్లడించారు. మన రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా చేపట్టాలన్న సదుద్దేశంతో జాతీయ రాజకీయాలలోకి వెళ్లలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిపారు. ఇది మనందరికీ గర్వకారణం అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 1 =