తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్ గా సోమా భరత్ కుమార్

CM KCR Appointed Soma Bharath Kumar as Telangana State Dairy Development Co-operative Federation Ltd Chairman,Soma Bharath Kumar,Telangana State Dairy Development,Dairy Development Chairman Soma Bharath Kumar,Mango News,Mango News Telugu,Telangana State Dairy Development Chairman,Soma Bharath Kumar,Telangana CM KCR, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates, Bharat Rashtra Samithi

తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సోమా భరత్ కుమార్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవీలో సోమా భరత్ కుమార్ రెండేళ్ల పాటుగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో డెయిరీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తన నియామక ఉత్తర్వులను భరత్ కుమార్ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా అందుకున్నారు. తనకు అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్ కు భరత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్న సోమా భరత్‌కుమార్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 10 =