మార్చి 21న టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం, అదేరోజున ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్, మంత్రుల బృందం

CM KCR Decided to Held TRS Legislative Party Meeting on March 21st at Telangana Bhavan, TRS Legislative Party Meeting on March 21st at Telangana Bhavan, CM KCR Decided to Held TRS Legislative Party Meeting on March 21st, CM KCR Decided to Held TRS Legislative Party Meeting, Telangana Bhavan, TRS Legislative Party Meeting, TRS Legislative Party Meeting on March 21st, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Chief minister of Telangana Decided to Held TRS Legislative Party Meeting on March 21st at Telangana Bhavan, TRS Legislative Party Meeting Latest News, TRS Legislative Party Meeting Latest Updates, TRS Legislative Party Meeting at Telangana Bhavan, TRS Party, Telangana, Mango News, Mango News Telugu,

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మార్చి 21, సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబి, డీసీఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మరోవైపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, మంత్రుల బృందం అదే రోజున ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధాని మోదీని కలిసి డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోళ్ళపై రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం 100 శాతం సేకరిస్తున్నందున క్రమంలో, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలోనే 100 శాతం ఎఫ్సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతుండడంతో టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =