రాష్ట్రంలో నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

CM KCR, First Phase Sheep Distribution Program, KCR Orders Officials to Complete First Phase Sheep Distribution Program, Mango News Telugu, Sheep Distribution scheme, Telangana CM KCR, Telangana Sheep Distribution, Telangana Sheep Distribution scheme, Telangana Sheep Distribution scheme News, Telangana Sheep Distribution scheme Updates, Telangana Sheep Distribution Status

కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + thirteen =