నిజామాబాద్ లో గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురు మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Expresses Grief over Death of 6 Persons due to Accidental Fall in Sriram Sagar Project, Death of 6 Persons due to Accidental Fall in Sriram Sagar Project, grief over death of six persons in sriram sagar project, KCR Expresses Grief over Death of 6 Persons, Mango News, Sriram Sagar Project, Sriram Sagar Project Accident, Sriram Sagar Project Accidental Fall, Sriram Sagar Project News, Telangana CM expresses shock

నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు పుష్కరఘాట్‌ వద్ద గోదావ‌రిలో పుణ్య‌స్నానాల కోసం వెళ్లిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ముందుగా స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒక‌రు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌గా, మిగిలిన ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని జాలర్ల సహాయంతో గాలింపు చేపట్టగా గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు పెద్దలు, నలుగురు యువకులు ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నెలకుంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. స్నానం చేయడానికని నదిలో దిగి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని సీఎం విచారం వక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆ భగవంతుడు వారికీ ధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలను అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =