ఖమ్మంలో బుధవారం మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తోలి బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఖమ్మం బీఆర్ఎస్ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ తో పాటుగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా రైతు సంఘాల ప్రతినిధులు, పలు జాతీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఖమ్మంలో జరిగే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు హాజయ్యేందుకు మూడు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు మంగళవారం రాత్రికే హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్ కు వచ్చారు. ప్రగతిభవన్ వద్ద సీఎం కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలకు, జాతీయనేతలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ప్రగతిభవన్ లో జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి.రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం వారంతా కొద్దిసేపు తాజా దేశ రాజకీయ పరిస్థితులు సహా పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా ప్రత్యేక హెలికాఫ్టర్ లలో యాదాద్రికి చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE