గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట రెండు ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ

TSRTC Launches Two Special Offers Like T6 F24 Tickets within the Suburban Limits of Hyderabad,TSRTC Launches Two Special Offers,T6 and F24 Tickets within the Suburban Limits,Special Offers Like T6 and F24 of Hyderabad,Mango News,Mango News Telugu,Affordable Travel in Hyderabad,TSRTC Special Offer Passengers,F-24 Ticket Offer,T-6 Ticket Special Offer,Budget-friendly ticketing offer,TSRTC Pocket-Friendly Offers,TSRTC Special Offer For Hyderabadis,TSRTC Latest News and Updates,Telangana Latest News,Telangana TSRTC Live News

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్ర‌యాణించే వారికి టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట టీఎస్ఆర్టీసీ రెండు ప్రత్యేక ఆఫర్స్ ను ప్రకటించింది. టీ6 (ధర రూ.50), ఎఫ్24 (ధర రూ.300) టికెట్ల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను గురువారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎస్ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

ఈ రెండు కొత్త ఆఫర్లపై ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ట్వీట్ చేస్తూ, “గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్‌లను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం టీ-6ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్‌-24 టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీ-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది” అని పేర్కొన్నారు.

టీ-6 టికెట్ వివరాలు (ధర రూ.50):

  • మహిళలు సీనియర్ సిటిజెన్ల కోసం హ్యాపీ అవర్స్ టికెట్
  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెల్లుబాటు
  • సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో చెల్లుబాటు
  • హైదరాబాద్ సబ్ అర్బన్ పరిధిల్లో అందుబాటు.

ఎఫ్-24 టికెట్ వివరాలు (ధర రూ.300):

  • ఒకే టికెట్ పై నలుగురు వ్యక్తులు ప్రయాణించే అవకాశం
  • సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణానికి చెల్లుబాటు
  • శని, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్ లో చెల్లుబాటు
  • హైదరాబాద్ సబ్ అర్బన్ పరిధిల్లో అందుబాటు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 4 =