తిమ్మాపూర్ వెంకన్న ఆలయానికి రూ.7 కోట్లు, బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు అందిస్తాం – సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సతీసమేతంగా బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఇక శ్రీదేవి, భూదేవి సతీసమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, స్వామివారికి 2 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం పాల్గొని, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలలో పాల్గొనడం అదృష్టమని, ఇక్కడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనిలో భాగంగా ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్, బాన్సువాడ పట్టణం కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం తరపున అందించనున్న ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, వీటితో నిర్దేశిత పనులను పూర్తి చేయాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 16 =