జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు మరో 3 రోజుల పాటు పొడిగింపు: నాదెండ్ల మనోహర్

Janasena 3rd Round of Membership Registration Drive Extends to March 3rd PAC Chairman Nadendla Manohar,Janasena 3rd Round of Membership,Janasena Registration Drive Extends,Janasena Membership Extends to March 3rd,PAC Chairman Nadendla Manohar,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,Janasena Chief Pawan Kalyan,AP Bjp Chief Somu Verraju,YSR Congress Party,Telugu Desam Party,Janasena Party,BJP Party,YSR Party,TDP Party,JSP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates, Andhra Pradesh Latest Investments, Andhra pradesh Politics,AP Governer,AP Cabinet Minister,AP Ministers,Andhra Pradesh Welfare Schemes,AP CM Jagan Latest News and Live Updates

జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోందని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మహాక్రతువులో పాలు పంచుకుంటున్న వాలంటీర్లు, జనసైనికులు, వీర మహిళల స్ఫూర్తి నిరూపమానమని, వారికి నాదెండ్ల మనోహర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును మరో 3 రోజుల పాటు అనగా మార్చి 3వ తేదీ వరకు పొడిగిస్తునట్టు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “గత కొద్ది రోజులుగా సాగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అమిత వేగంతో సాగుతోంది. అన్ని ప్రాంతాల నుంచి సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభ పరిణామం. అయితే సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టినట్లు, సభ్యత్వం గడువు మరి కొంత పెంచాలని జన సైనికులు, వాలంటీర్లు, వీర మహిళల నుంచి లెక్కకు మించి అభ్యర్ధనలు జనసేన పార్టీ కార్యాలయానికి అందాయి. దీంతో సభ్యత్వ నమోదు గడువును మరో మూడు రోజులు పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగియాల్సిన గడువును మార్చి 3వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు పెంచుతూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాన్ని అనుసరించి సభ్యత్వ నమోదు గడువు మూడు రోజులపాటు పెంచుతున్నాం. దీన్ని వాలంటీర్లు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు గమనించాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 9 =