దిబ్రూగర్ చేరుకొని తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న గంగా విలాస్ క్రూయిజ్, సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

PM Modi Expresses Happiness after Ganga Vilas Cruise Completes its Maiden Journey at Dibrugarh,PM Modi Expresses Happiness,Ganga Vilas Cruise Completes, Ganga Vilas Maiden Journey at Dibrugarh,Mango News,Mango News Telugu,Indian Prime Minister Narendra Modi,Indian PM Narendra Modi,Narendra Modi,PM Narendra Modi, Narendra modi Latest News and Updates, Modi Twitter Live Updates,Union Minister Amit Shah,Union Minister Rajnath Singh,Union Minister Nithin Gadkari,Union Minister Nirmala Sitharaman,National Politics, Indian Politics, Indian Political News, National Political News, Latest Indian Political News,BJP Party, BRS Party, AAP Party,Delhi CM Kejriwal,National Political Parties,Indian POlitical News Live Updates,Central Welfare Schemes, PM Kisaan Yojana

ప్ర‌పంచంలోని అతి పొడవైన రివ‌ర్ క్రూయిజ్-ఎంవీ గంగా విలాస్‌ దిబ్రూగర్ చేరుకుని, తన తొలి ప్రయాణాన్ని పూర్తిచేసుకోవడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ చేసిన ట్వీట్‌కు ప్రధాని మోదీ ప్రతిస్పందిస్తూ, “ఒక ప్రత్యేక ప్రయాణం పూర్తయింది. గంగా విలాస్ క్రూయిజ్‌లో భారతదేశం మరియు విదేశాల నుండి ఎక్కువ మంది పర్యాటకులు పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ముందుగా జనవరి 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ వారణాసి నుంచి గంగా విలాస్‌ క్రూయిజ్ ను జెండా ఊపి ప్రారంభించారు. గంగా విలాస్ రివ‌ర్ క్రూయిజ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, 50 రోజుల్లో 3,200 కి.మీ ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్‌కు ఫిబ్రవరి 28, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంది. ఈ సందర్భంగా గంగా విలాస్‌ క్రూయిజ్ లో ప్రయాణించిన 28 మంది విదేశీ పర్యాటకులకు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లోని 27 నదీ వ్యవస్థల మీదుగా ప్రయాణించేలా గంగ విలాస్ మార్గం రూపొందించారు. గంగా విలాస్ విహార నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.

ఎంవీ గంగా విలాస్‌లో మూడు డెక్‌లు, 36 మంది పర్యాటకుల సామర్థ్యంతో 18 సూట్‌లు ఉన్నాయి, అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. గంగా విలాస్ క్రూయిజ్ దేశంలోని అత్యుత్తమమైన వాటిని ప్రపంచానికి ప్రదర్శించడానికి క్యూరేట్ చేయబడింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా మరియు అస్సాంలోని గౌహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాల సందర్శనలతో 51 రోజుల పాటుగా క్రూయిజ్ ప్లాన్ చేయబడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =