మహాత్మా గాంధీ ఆదర్శాలు దేశానికి తక్షణావసరం, గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతాం: సీఎం కేసీఆర్

CM KCR Pays Tributes to Father of the Nation Mahatma Gandhi on his Death Anniversary,CM KCR Pays Tributes,Father of the Nation,Mahatma Gandhi,Mahatma Gandhi Death Anniversary,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

కుల, మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మా గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణావసరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచిలా నిలుస్తారని సీఎం పేర్కొన్నారు. నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక్క చేయకుండా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ విజయతీరాలకు చేరాలనే స్ఫూర్తిని, గాంధీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందన్నారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here