తెలంగాణలో ఆగస్టు 5 నుంచి జిమ్స్, యోగ సెంటర్లు ప్రారంభం

Gyms, Minister Srinivas Goud, Minister Srinivas Goud Reviewed Unlock 3 Guidelines, Telangana News, Telangana Unlock 3, Telangana Unlock 3 Guidelines, unlock 3 guidelines, Unlock 3 Guidelines over Opening of Yoga Centers

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం సవరించిన కోవిడ్-19 నిబంధనలపై ప్రముఖ క్రీడాకారులు మరియు క్రీడా శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం ఉందన్నారు. వీటితో పాటు క్రీడారంగం కూడా తీవ్రంగా నష్ట పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సవరించిన కోవిడ్ -19 నిబంధనల అనుగుణంగా లాక్‌డౌన్ తర్వాత మళ్ళీ యోగ సెంటర్లు, జిమ్ లను ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమిస్తున్నామన్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితోనే ఫిట్నెస్ సెంటర్లు నడిపించాలని మంత్రి నిర్వాహకులకు సూచించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి స్టేడియాలలో ఆటగాళ్లు తగిన జాగ్రత్తలతో ప్రాక్టీస్ చేసుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను పాటించాలన్నారు. అందులో భాగంగా ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులు కోవిడ్ నిబంధనలు, డిస్టన్స్ పాటిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ, తగిన ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు శిక్షణ ఇచ్చే క్రీడా సెంటర్ ల నిర్వాహకులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ క్రీడాకారులు సూచించిన పలు సూచనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

స్టేడియం సామర్ధ్యం ప్రకారం సగం మంది క్రీడాకారులు రోజు విడిచి రోజు ప్రాక్టీసు చేసుకొనేలా క్రీడా శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారుల కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుదన్నారు. ఎలాంటి క్రీడా టౌర్నమెంట్ల నిర్వహణకు అనుమతి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీపై సబ్ కమిటీ వేశారన్నారు. స్పోర్ట్స్ పాలసీపై తమ సలహాలు, సూచనలు ఇవ్వడానికి సీనియర్ ప్లేయర్లు, కోచ్ లు ముందుకు రావాలని మంత్రి కోరారు.నూతన క్రీడా పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రం క్రీడా క్యాపిటల్ గా రూపొందేవిధంగా దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందించేందుకు మంత్రి కేటిఆర్ సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, బాడ్మింటన్ ప్లేయర్స్ సిక్కి రెడ్డి, సాయి ప్రణీత్, సుమిత్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, స్పోర్ట్స్ అండ్ టూరిజం సెక్రటరీ మరియు సాట్స్ ఎండీ కేఎస్ శ్రీనివాస రాజు, బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముందేశ్వరినాథ్ లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − three =