గ్రామపంచాయతీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Rao held a Review Meeting with Officials on Development Works,Mango News,Mango News Telugu,Minister Errabelli Dayakar Rao,Minister Errabelli Dayakar Rao Review Meeting On Development Works,Minister Errabelli Review Meeting,Minister Errabelli Dayakar Rao,Errabelli Dayakar Rao Development Works,Development Works,Errabelli Dayakar Rao,Errabelli Dayakar Rao About Development Works,Errabelli Dayakar Rao Live,Errabelli Dayakar Rao Review Meeting,Minister Errabelli Review Meeting,Minister Errabelli Conduct Review Meeting,Minister Errabelli Hold Review Meeting,Minister Errabelli To Hold Review Meeting,Minister Errabelli Review,Minister Errabelli Review Meeting Live,Minister Errabelli Review Meeting

రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పెండింగ్ లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 217 కోట్ల 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేసిందని, ఈ నిధులతో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడానికి గ్రామపంచాయతీలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీ రాజ్ శాఖ ఉన్నత అధికారులను కోరారు. సోమవారం నాడు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ ఉన్నత అధికారుల సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ది పథకాలను మంత్రి సమీక్షించారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పనులు ఉదృతంగా జరుగుతున్నాయని, అందువల్ల పని ప్రదేశాల్లో కూలీలకు కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. కూలీలు తప్పక చేతులను శానిటైజన్ చేసుకోవడంతో పాటుగా మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించి పనులు చేసే విధంగా సంబంధిత అదికారులు, ఉద్యోగులు చూడాలని కోరారు. అదే విదంగా ప్రస్తుత ఎండ కాలంలో కూలీలు వడ దెబ్బ పడకుండ సంబంధిత అదికారులు, ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఆరోగ్య సర్వేలో ఆశ వర్కర్లతో సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు సమన్యయంతో పనిచేసి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా జరిగే విధంగా చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1554 కోట్ల రూపాయల వ్యయంతో 12270 వైకుంఠ ధామాల నిర్మాణాన్ని చేపట్టడం జరగగా, ఇందులో 11250 పూర్తి అయ్యాయని, 1470 వివిధ దశలల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా దృష్ట్యా పూర్తి అయిన వైకుంఠధామాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. అదే విదంగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన పీఎం జీఎస్ వై పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోరారు.

కరోనా నివారణ చర్యలలో భాగంగా సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు గ్రామాలు పారిశుధ్యముగా ఉండే విధంగా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమము కింద నాటిన మొక్కలను నీటిని పోసి మొక్కలు ఎండి పోకుండా చూడాలని సర్పంచులను, పంచాయితీ కార్యదర్శులను కోరారు. నాటిన మొక్కలలో 100 శాతం సంరక్షించడనికి సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు భాద్యత తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో కోవిడ్ సోకిన రోగులకు వారి ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండటానికి సమస్యలు ఉన్నట్లయితే సంబందిత గ్రామములోని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ విద్యార్థుల వసతి గృహాల్లో ఐసోలేషన్ సెంటర్లును సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దాతల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాల్లో రోగులకు ఆహారం, పoడ్లు, పాలు, ఇతర నిత్యవసర వస్తువులు అందించాలని సూచించారు.

కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రెవెన్యూ ఆశించిన మేర రానప్పటికి సహృదయంతో నిదులను, ఆసరా పెన్షన్లు లబ్దిదారులకు విడుదల చేయడానికి కావాల్సిన నిధులను సహృదయంతో మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ రఘున౦ధన్ రావు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సి సంజీవ రావు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + thirteen =