మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్

Chiranjeevi Tested Corona, Chiranjeevi Tested Corona Positivea, Chiranjeevi Tested Covid Positive, CM KCR, CM KCR calls Chiranjeevi to know his health status, CM KCR Wishes A Speedy Recovery of Megastar Chiranjeevi From Corona, CM KCR wishes Chiranjeevi a speedy recovery, KCR Wishes A Speedy Recovery of Megastar Chiranjeevi, Mango News, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Health, Megastar Chiranjeevi Health News, Recovery of Megastar Chiranjeevi From Corona

మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య వివరాలను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అంటూ ఆకాంక్షించారు. కాగా తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని బుధవారం నాడు ట్విటర్‌ ద్వారా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. తాను హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నట్లు చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. అటు మెగాస్టార్ అభిమానులు కూడా చిరు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 20 =