తెలంగాణాలో ధాన్యం కొనుగోలు విషయమై ప్ర‌ధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్‌

CM KCR Writes Letter To PM Narendra Modi About Paddy Procurement in Telangana, KCR Writes Letter To PM Narendra Modi About Paddy Procurement in Telangana, Telangana CM KCR Writes Letter To PM Narendra Modi About Paddy Procurement in Telangana, Telangana CM KCR Writes Letter To PM Narendra Modi, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement, Paddy Procurement Latest News, Paddy Procurement Latest Updates, Paddy Procurement Live Updates, PM Narendra Modi, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణాలో ధాన్యం కొనుగోలు విషయమై ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో ఏ వరి ధాన్యం అందుబాటులో ఉందో దానిని కేంద్రం సేకరించాలని, యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని లేఖ‌లో కోరారు. గత రెండు సంవత్సరాలుగా వరి సేకరణకు ఆహార మంత్రిత్వ శాఖ విముఖత చూపుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను భావిస్తున్నాను అని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం ప్ర‌కారం ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌, వాటి భ‌ద్ర‌త కూడా కేంద్రానిదే అని తెలిపారు. రబీ సీజన్‌లో మొత్తం వరిని తెలంగాణ నుంచి సేకరించేలా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని లేఖలో కోరారు. ప్రధాని మోదీ చొరవ తీసుకుని దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యవసాయ నిపుణులు, అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించి తగిన జాతీయ సేకరణ విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ లేఖలో ఆ కోరారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం రాష్ట్ర పీడీఎస్ అవసరాలు తీర్చిన తర్వాత కేంద్రం మొత్తం వరి ధాన్యాన్ని సేకరించాలని ప్ర‌ధాని మోదీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. జాతీయ స్థాయి ఆహార ధాన్యాల సేకరణ విధానం ఏకరీతిగా లేదని ఎత్తిచూపిన ముఖ్యమంత్రి, “పంజాబ్, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో మార్కెట్ చేయదగిన మొత్తం మిగులు వరి, గోధుమలను కేంద్రం సేకరిస్తుంది, కానీ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రం ఇలా చేయడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు భిన్నంగా ఉండకూడదని, దేశమంతా ఒకే ర‌క‌మైన విధానం ప్రకారం నడుచుకోవాలని సీఎం కేసీఆర్ లేఖలో వెల్లడించారు. అయితే ఈరోజు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీఆర్‌ఎస్‌ మంత్రుల అధికారిక ప్రతినిధి బృందం సమావేశం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రధాని దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − six =