మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

Congress Senior Leader, Congress Senior Leader Ex-MP Nandi Yellaiah, Coronavirus, COVID-19 claims senior politician, Ex-MP Nandi Yellaiah, nandi yellaiah corona death, Senior Congress leader Nandi Yellaiah dies, telangana, Telangana Coronavirus, Yellaiah Shri Nandi

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలో నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున సిద్దిపేట స్థానం నుంచి ఐదుసార్లు, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఒకసారి మొత్తం ఆరుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే రాజ్యసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణ గల నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. సీనియర్ నాయకుడు నంది ఎల్లయ్య మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here