తెలంగాణ కరోనా : కొత్తగా 81 పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు 543

Covid-19 in Telangana: 81 Positive Cases 87 Recoveries Reported on October 21st,Telangana Records 128 New Covid Cases, Covid Recoveries September 9th, Mango News, Mango News Telugu, Telangana Logs 128 Covid Positive Cases, 128 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 543 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 81 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 21, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,39,493 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 39 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.45 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 87 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,34,839 కు చేరుకుంది. ప్రస్తుతం 543 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. శుక్రవారం నాడు 8,573 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,78,52,761 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,17,001 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 351 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =