అమరావతి రైతుల కీలక నిర్ణయం, పోలీసుల తీరుకు నిరసనగా ‘మహా పాదయాత్ర’ తాత్కాలికంగా నిలిపివేత

AP Amaravati Farmers Stops Maha Padayatra Temporarily For Few Days Amid Tension Prevails by Police, AP Amaravati Farmers Stops Maha Padayatra Temporarily, Maha Padayatra Temporarily Stopped, Amaravati Farmers Stops Maha Padayatra, Mango News, Mango News Telugu, TDP Chief Chandrababu , YSR Congress Party, TDP Party, Amaravati Farmers Maha Padayatra, Perni Nani Latest News And Updates, TDP News And Live Updates

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ‘మహా పాదయాత్ర’ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం రాజధాని జేఏసీ నేతల సమావేశంలో నిర్ణయించారు. పోలీసులు తమను అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కోర్టు అనుమతితో పాదయాత్ర ప్రారంభించినా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పోలీసుల తీరుని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కోర్టుకి సెలవులు ఉన్న దృష్ట్యా తిరిగి ప్రారంభమయ్యాక కోర్టు సూచించిన విధంగా పాదయాత్రను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీంతో మహా పాదయాత్ర దాదాపు 4రోజుల పాటు నిలిచిపోనుంది.

కాగా శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసలపూడి వద్ద అమరావతి రైతుల మహా పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని రాయవరంలో ఉదయం పాదయాత్ర ప్రారంభించిన రైతులు మధ్యాహ్నానికి పసలపూడి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనానికి కొద్దిసేపు విరమించిన రైతులు తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులు తమ గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే ముందుకు సాగాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి కోరారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నప్పటికీ రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన తోపులాటలో కొంతమంది కార్యకర్తలు, జేఏసీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొన్ని గంటలపాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జేఏసీ నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు తదితరులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతులు తమ గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే పాదయాత్రకు అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇన్ని రోజులూ గుర్తింపుకార్డులు చూపించమని రైతులను అడగని పోలీసులు ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నారని వారు ప్రశ్నించారు. తాము హైకోర్టు సూచనల మేరకే పాదయాత్రను చేస్తున్నామని, ఆర్డర్‌ కాపీని చూపకుండానే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 1 =