పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు షాక్.. ఐదేళ్లపాటు నిషేధం విధించిన ఈసీ

Pakistan Election Commission Disqualifies Former PM Imran Khan From Public Office For Five Years, Pakistan Election Commission, Former Pak PM Imran Khan, Pak EC Disqualifies Former PM Imran Khan, Mango News,Mango News Telugu, Public Office For Five Years, Pakistan EC Latest News And Updates, Pakistan Politics News And Live Updates, Election Commission, Pakistan Public Office For Five Years, Imran Khan News And Live Updates, Former PM Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ ఎన్నికల కమిషన్ ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. నేటినుంచి మరో ఐదేళ్ల వరకు ఏ విధమైన ప్రభుత్వ పదవులను చేపట్టరాదని ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ అవినీతికి పాల్పడినట్లు పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) తేల్చింది. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ నేతలు, ప్రతినిధుల నుంచి ఆయన స్వీకరించిన ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా అమ్ముకున్నందుకు ఈ చర్య తీసుకుంది. విదేశీ నాయకుల నుండి అందుకున్న బహుమతుల గురించి ఆయన పూర్తిగా అధికారులను తప్పుదారి పట్టించారని పాకిస్థాన్ ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. కాగా ‘తోషాఖానా’ బహుమతులు, వాటి అమ్మకాల వల్ల వచ్చిన నగదు వివరాలను ఇవ్వడం లేదని పరాదని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ పైన కేసు నమోదు చేసింది.

కాగా ఈ కేసు ‘తోషఖానా’ అని పిలువబడే ప్రభుత్వ శాఖకు సంబంధించినది. ఇది మొఘల్ యుగంలో రాచరిక పాలకులు వారికి వచ్చిన విలాసవంతమైన బహుమతులను నిల్వ చేయడానికి మరియు ప్రదర్శించడానికి అధికారం కలిగి ఉంటుంది. ఈ ‘తోషాఖానా’ రిఫరెన్స్‌లో ఆయన తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చినందుకు ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా ఒక ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ వచ్చే ఎన్నికల్లో నేషనల్ అసెంబ్లీకి పోటీ చేయడం కుదరదు. అయితే దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టులో సవాలు చేయబోతున్నామని ఇమ్రాన్ తరపు లాయర్లు తెలిపారు. అలాగే ఈసీపీ ప్రకటనపై పీటీఐ ఉపాధ్యక్షుడు ఫవద్ చౌదరి తీవ్రంగా స్పందించారు. ఈసీపీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసన తెలపడానికి పార్టీ కార్యకర్తలకు మరియు దేశప్రజలకు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =