మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కే సీపీఐ మద్దతు, బీజేపీని ఓడించడమే లక్ష్యం : చాడ వెంకట్‌రెడ్డి

CPI State secretary Chada Venkat Reddy Announces CPI Party Supports TRS in Munugode By-election, CPI To Extend Support To TRS For Upcoming Munugode Assembly By Election, Upcoming Munugode Assembly By Election, Munugode Assembly By Election, Munugode By Election, Munugode By Poll, CPI To Extend Support To TRS, Communist Party of India, Telangana Rashtra Samithi, Komatireddy Raj Gopal Reddy, Munugode Assembly, Munugode Assembly By Election News, Munugode Assembly By Election Latest News And Updates, Munugode Assembly By Election Live Updates, Mango News, Mango News Telugu,

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి సీపీఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉపఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీకే మద్ధతు ఇస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఉపఎన్నికపై శనివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తమ జాతీయ పార్టీ తీర్మానం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు, పరిస్థితి గురించి వ్యాఖ్యానించ దలుచుకోలేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్వార్థ ప్రయోజనాల వల్లే ప్రజలపై ఉపఎన్నిక రుద్దబడిందన్నారు.

మునుగోడులో ఐదు సార్లు సీపీఐ గెలిచినా, ప్రస్తుత ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదని అన్నారు. అందువలనే బీజేపీని ఓడించే సత్తా ఉన్న టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మునుగోడు బహిరంగ సభకు కూడా హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారని, పల్లా వెంకట్ రెడ్డి సహా పలువురు సీపీఐ నేతలు సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ మద్ధతు మునుగోడు ఉపఎన్నిక వరకే పరిమితం కాదని, భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం ఒక కార్యాచరణతో కలిసి ముందుకెళ్లాలనే భావనలో ఉన్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eleven =