హైద‌రాబాద్‌లో రూ. 200 కోట్ల‌తో టీకాల త‌యారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న బీఎస్‌వీ గ్లోబ‌ల్ సంస్థ

Telangana BSV Global Company To Invest 200 Crores in Hyderabad's Genome Valley, BSV Global Company To Invest 200 Crores in Hyderabad's Genome Valley, Genome Valley, BSV Global Company To Invest 200 Crores in Hyderabad, Hyderabad's Genome Valley, Biopharmaceutical firm Bharat Serums and Vaccines Limited, BSV Global Company would invest Rs 200 crore in the development of injectable and vaccine manufacturing facility at Genome Valley, Bharat Serums and Vaccines to invest Rs 200 crore in Hyderabad's Genome Valley, Bharat Serums and Vaccines Ltd commits to invest INR 200 crores in Genome Valley, Bharat Serums and Vaccines Global will set up an injectable and vaccine manufacturing facility at Genome Valley, Bharat Serums and Vaccines Global, Bharat Serums and Vaccines Global to invest INR 200 Crores in vaccine manufacturing in Hyderabad's Genome Valley, Bharat Serums, Bharat Vaccines Global, BSV Global Company Latest News, BSV Global Company Latest Updates, BSV Global Company Live updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది. భార‌త్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీఎస్‌వీ) సంస్థ రాజధాని నగరం హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సిద్ధమైంది. రూ. 200 కోట్ల‌తో టీకాల త‌యారీ కేంద్రాన్ని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయ‌నుంది ఈ బీఎస్‌వీ గ్లోబ‌ల్ సంస్థ. ఈ మేర‌కు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్ ప్ర‌క‌టించారు. ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌ను క‌లిశారు. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నందుకు సంస్థ ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్‌కు కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సరికొత్త టీకాల త‌యారీ కేంద్రం ఏర్పాటుతో హైద‌రాబాద్ వ్యాక్సిన్ హ‌బ్‌గా నిలవనుందని మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్ ఇటీవలే తెలంగాణాలో పెట్టుబడులను ఆహ్వానించటానికి అమెరికా పర్యటన కూడా చేసిన విషయం తెలిసిందే. దేశీయంగా ఉన్న ప్రముఖ కంపెనీలతో పాటు కొత్తగా వ్యాపారం రంగంలోకి ప్రవేశించటానికి ఉత్సాహం చూపే కొత్త ఎంట్రప్రెన్యూర్స్ వరకు అందరినీ మంత్రి కేటీఆర్ తెలంగాణాలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడులకు సిద్దమైన వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, రాయితీలు ప్రకటిస్తామని వారికి హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొని కంపెనీలు హైద‌రాబాద్‌లో తమ శాఖలను విస్తరించడానికి ముందుకొస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − four =