తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా, త్వరలో రీషెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి

degree exams News, Degree PG exams in Telangana postponed, Degree PG Exams Postponed, Degree PG Exams Postponed In Telangana, Latest News on degree exams, Mango News, Telangana All UG PG Semester Exams Are postponed, Telangana Degree PG Exams Postponed, Telangana Degree PG Exams Postponed 2021, Telangana Exams Postponed

తెలంగాణ రాష్ట్రంలో కరోనావ్యాప్తి నేపథ్యంలో వైద్య కళాశాలలు మినహా విద్యాసంస్థలన్నింటినీ మార్చి 24, బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరీక్షల విషయంలో మరో కీలక నిర్ణయం వెలువడింది. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తునట్టుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే రీషెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ముందుగా విద్యాసంస్థలు మూసివేత ప్రకటన అనంతరం పరీక్షలు యథాతథంగా జరుగుతాయని యూనివర్సిటీలు ప్రకటించాయి. అయితే పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి సమీక్ష జరిపి, అన్ని యూనివర్సిటీల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 11 =