తెలంగాణలో థియేటర్లను మూసివేయడం లేదు, పుకార్లను నమ్మొద్దు : మంత్రి తలసాని

Closing Movie Theatres, Closing Movie Theatres In Telangana, Mango News, Minister Talasani Gives Clarity on Closing Movie Theatres, Minister Talasani Srinivas, Minister Talasani Srinivas Gives Clarity Over Theatres Closure, Minister Talasani Srinivas Gives Clarity Over Theatres Closure in the State, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Gives Clarity Over Theatres Closure, Talasani Srinivas Yadav Gives Clarity about Closing Theaters

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లను మూసివేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపై రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ఆ వార్తలు అవాస్తవాలని, పుకార్లను నమ్మవద్దని చెప్పారు. “తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికే కరోనా మూలానా పెద్దఎత్తున నష్టపోయింది. ఇండస్ట్రీలో ఉన్న టెక్నిషియన్స్, 24 క్రాఫ్ట్స్, కార్మికులు ఇలా వేలాది మందికి ఇబ్బందికర పరిస్థితిలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం అన్ని విధాలుగా అందుకున్నప్పటికీ, లక్షలాది మంది జీవితాలు పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయికాబట్టి థియేటర్స్ మూసివేతపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

“కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా థియేటర్లు యధావిధిగా నడుస్తాయి. దయచేసి పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరి ప్రయోజనాలు, వారికున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, కోవిడ్ నిబంధనలను థియేటర్ల యాజమాన్యాలు యధావిధిగా పాటించాలి” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =