పూర్తి ఆరోగ్యంతో ఉన్న సీఎం కేసీఆర్, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు

Doctors about Telangana CM KCR Covid Tests Results,Mango News,Mango News Telugu,Telangana CM KCR,CM KCR,KCR,CM KCR Latest News,CM KCR News,CM KCR Live,CM KCR Press Meet,CM KCR Latest Update,CM KCR Covid Tests Results,CM KCR Covid News,CM KCR Covid Update,CM KCR Covid Results,Doctors About Telangana CM KCR Covid Results,Telangana CM KCR Covid Tests Results,CM KCR Latest Health Report,CM KCR Health Report,CM KCR Health Update,Doctors About CM KCR Covid Tests Results,Doctors On CM KCR Covid Tests Results,RT-PCR Test On Telangana CM KCR,Telangana CM KCR Corona Tests Results,Antigen,RT PCR Covid-19 Tests Conducted on Telangana CM,CM KCR Health Condition

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గురువారం నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. బుధవారం యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎం.వీ.రావు తెలిపారు.

ముందుగా ఏప్రిల్ 19న స్వల్ప లక్షణాలతో సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు అప్పటినుంచే సీఎం కేసీఆర్ తన ఫామ్‌ హౌస్‌లో ఐసోలేషన్ లో ఉన్నారు. వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − two =