దుబ్బాకలో కీలక పరిణామం, మళ్ళీ సొంతగూటికి చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్స్

Dubbaka, Dubbaka TRS Councillors, Dubbaka TRS Councillors Who Joined in BJP, Dubbaka TRS Councillors Who Joined in BJP Yesterday, Dubbaka TRS Councillors Who Joined in BJP Yesterday Again Joined into the TRS Party, Dubbaka TRS Councillors Who Joined in TRS Again, Mango News, TRS Councillors, TRS Councillors Who Joined in BJP, TRS Councillors Who Rejoined in TRS, Two councillors return to TRS, Two councillors return to TRS within 24 hours

దుబ్బాక మునిసిపాలిటీలో ఆసక్తికర రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బుధవారం నాడు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అయిన మట్ట మల్లారెడ్డి (3వ వార్డు), దివిటి కనకయ్య (7వ వార్డు), దుబ్బాక బాలకృష్ణ గౌడ్ (8వ వార్డు) బీజేపీ పార్టీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకుండానే వీరిలో దివిటి క‌న‌క‌య్య‌, దుబ్బాక బాల‌కృష్ణ‌ తిరిగి గురువారం నాడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఇద్దరు టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్స్ మళ్ళీ సొంతగూటికి చేరుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి మంత్రి హరీశ్ రావు స్వాగతం పలికారు. ఇది ప్రగతి ప్రభుత్వమని, అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని కౌన్సిలర్స్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 12 =