ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ సమీర్‌శర్మ

AP CS Sameer Sharma Issues Orders Regarding Transfers of Many IAS Officers, CS Sameer Sharma Issues Orders Regarding Transfers of Many IAS Officers, Transfers of Many IAS Officers, AP Chief Secretary Sameer Sharma, Chief Secretary Sameer Sharma, AP CS Sameer Sharma, IAS Officers Transfers, AP IAS Transfers, AP IAS Officers Transfers, AP IAS Officers Transfers News, AP IAS Officers Transfers Latest News And Updates, AP IAS Officers Transfers Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయా అధికారులని వివిధ శాఖలకు బదిలీ చేశారు.

సీఎస్‌ సమీర్‌శర్మ ఉత్తర్వులు ప్రకారం బదిలీ అయిన అధికారులు – వారికి కేటాయించిన శాఖలు

  • హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా ఉన్న చదలవాడ నాగరాణిని సాంకేతిక విద్యా డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
  • సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్‌ను హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ కార్యదర్శిగా బదిలీ చేశారు.
  • పోలా భాస్కర్‌ను సాంకేతిక విద్యా డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. కొత్తగా ఆయనకు ఆప్కో వీసీ, ఎండీతోపాటు ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా ఉన్న కాటంనేని భాస్కర్‌ను పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ చేశారు.
  • అయితే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కాటంనేని భాస్కర్‌ మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
  • బి. శ్రీనివాసరావును సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన రైతుబజార్ల సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =