తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జనవరి 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో పాఠాల బోధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నేటి నుంచే (జనవరి 24, సోమవారం) ఆన్లైన్/డిస్టెన్స్ పాఠాలు నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీ శాట్, దూరదర్శన్ యాదగిరి ఛానెళ్ల ద్వారా ఆన్లైన్ పాఠాలు ప్రసారం చేయనున్నారు.
మరోవైపు రొటేషన్ బేసిస్ లో సోమవారం నుంచి 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాఠశాలలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు అమలయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెడ్ ఆఫ్ ది డిపార్మెంట్స్ కు, హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు, జిల్లాల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF