సమత, హజీపూర్‌ కేసుల్లో తుది తీర్పు వాయిదా

Final Verdict Postponed In Samatha And Hajipur Cases,Mango News,Latest Breaking News 2020,Hajipur murder case Verdict,Samatha Case Judgement,Telangana News, Telangana Latest News,Hajipur Cases Final Verdict Postponed,Samatha Hajipur Case Updates

తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక కేసుల్లో తుది తీర్పు వాయిదా పడింది. కుమురంభీం జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సామూహిక హత్యాచారానికి పాల్పడినందుకు నిందితులు షేక్‌బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మక్దూం లపై కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం డిసెంబర్‌ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేశారు. వాదనలు ముగియడంతో ఈ కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడాల్సి ఉండగా, న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో తీర్పు వాయిదా పడిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఈ కేసులో జనవరి 30వ తేదీన తుదితీర్పు వెలువరించనున్నటు ప్రకటించారు.

అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసులులకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వాదనలు ముగియడంతో తుది తీర్పును జనవరి 27న వెలువరించనున్నట్లు జనవరి 17న పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే ఈ కేసులో తుదితీర్పును ఫిబ్రవరి 6కి వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసులో ముందుగా నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడి హతమార్చినట్లుగా పేర్కొంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివిధ దశల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వాదనలు ముగియడంతో తుది తీర్పు వెలువడాల్సి ఉంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 3 =